: గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య... ఏడేళ్ళలో 80 శాతం వృద్ధి


ఇండియాలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడేళ్ల క్రితం 1,400గా ఉన్న పులుల సంఖ్య 2014లో 2,226కు పెరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. ప్రపంచంలోని 70 శాతం పులులు ఇండియాలోనే వున్నాయని ఆ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ నేడు వివరించారు. కర్ణాటకలో అత్యధికంగా 406 పులులు వున్నాయని ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్ లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్ లో 208, మహారాష్ట్రలో 190 పులులు వున్నాయని ఆయన తెలిపారు. 20వ శతాబ్దం ప్రారంభంలో లక్షకు పైగా వున్న పులుల సంఖ్య వేటగాళ్ళ పుణ్యమాని 2008లో 1411కు తగ్గింది. తదుపరి తీసుకున్న చర్యల మూలంగా వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

  • Loading...

More Telugu News