: యూరియా బ్లాక్ మార్కెటింగ్ పై రైతుల కన్నెర్ర... అనంతసాగరంలో ఉద్రిక్తత


నల్ల బజారుకు తరలిపోతున్న యూరియా ఉదంతంపై రైతులు కన్నెర్రజేశారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనంపై నిరసన వ్యక్తం చేయడమే కాక సదరు కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో సొసైటీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రైతులను నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ సందర్భంగా రైతులు కూడా పోలీసులు, అధికారులపైకి తిరగబడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో రైతుల ఆందోళన, పోలీసుల లాఠీచార్జీతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News