: ఢిల్లీలో తెలంగాణకు మరో అధికార ప్రతినిధి


ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, సాహ్నికి కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఢిల్లీలో టీఎస్ ప్రభుత్వానికి ఇద్దరు అధికార ప్రతినిధులు ఉన్నారు. సీనియర్ నేత ఎస్.వేణుగోపాలాచారి, టీఆర్ఎస్ నేత రామచంద్ర నాయక్ లు ఇప్పటికే అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంతో సంబంధాలను పెంచుకోవడానికే మూడో ప్రతినిధిగా సాహ్నిని నియమించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News