: వేదిక మీదకు పిలవలేదని అలిగిన విశాఖ ఎంపీ హరిబాబు


విశాఖపట్నం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అలిగారు. ఎవరి మీదనుకుంటున్నారు? ఇంకెవరి మీద, ఏపీ మంత్రుల మీదే. అయినా ఎంపీ అయిన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై అలగాల్సిన అవసరం ఏముందంటారా? ఎందుకు లేదూ... నిత్యం ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య నిప్పు రాజేస్తున్న ప్రొటోకాల్ వివాదం నేపథ్యంలోనే హరిబాబు అలకబూనారు. అసలు విషయమేంటంటే, నిన్న విశాఖలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో హరిబాబును ఆహ్వానించినప్పటికీ, ఆయనను వేదిక మీదకు ఆహ్వానించలేదు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడైన హరిబాబు, అక్కడే మంత్రులను, అధికారుల దునుమాడారట. పొరపాటు జరిగింది, క్షమించి వేదికెక్కండన్న మంత్రులు, అధికారుల విన్నపాన్ని తిరస్కరించిన ఆయన అక్కడినుంచి విసవిసా వెళ్లిపోయారట. అలిగిన హరిబాబును బుజ్జగించేందుకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన యత్నాలు కూడా ఫలించలేదట.

  • Loading...

More Telugu News