: ప్రతి విషయాన్ని విమర్శించేవారు ఉంటారు... వారిని పట్టించుకోను: జీవిత రాజశేఖర్
ఇటీవలే బీజేపీలో చేరి, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఎంపికైన జీవిత రాజశేఖర్ తన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని చెప్పారు. ఇరవై ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్నానని... అదే రంగానికి చెందిన పదవి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. బీజేపీ రాజకీయ నేపథ్యంలోనే పదవి దక్కిందన్న కామెంట్లను కొట్టిపారేసిన ఆమె... ప్రతి విషయాన్ని విమర్శించే వారు ఉంటారని, అలాంటి వారిని పట్టించుకోనని అన్నారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని... సమాజానికి సేవ చేయాలనే చేరామని జీవిత చెప్పారు.