: టీపీసీసీ మేధోమథనం... హాజరుకానున్న డిగ్గీరాజా, కుంతియా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేధో మథనం నేడు ప్రారంభం కానుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నానాటికీ పతనమవుతుండటం, పార్టీ నేతల్లో పెరిగిపోతున్న అంతరం తదితరాలపై ఈ సదస్సుల్లో ప్రధానంగా చర్చించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, పార్టీ సీనియర్ నేత కుంతియాలు హాజరుకానున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ పార్టీని ప్రజలు ఆదరించకపోవడానికి గల కారణాలు, భవిష్యత్తులో పార్టీ పునర్మిర్మాణం తదితర అంశాలపైనే సదస్సులో చర్చ జరగనుందని సమాచారం. అంతేకాక నాయకత్వ మార్పిడి అంశంపైనా అధిష్ఠానం దూతలు దృష్టి సారించే అవకాశాలున్నాయి.