: కృష్ణానదిలో మునిగిన లారీ
నల్గొండ జిల్లా సరిహద్దులోని కృష్ణా నదిలో ఒక లారీ మునిగింది. ఈ ఘటన నేటి ఉదయం మేళ్లచెరువు మండలం చింతిర్యాల వద్ద జరిగింది. ఇవతలి ఒడ్డు నుంచి గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు లారీని బల్లకట్టుపై ఎక్కిస్తుండగా అదుపుతప్పి మునిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ ప్రాంతంలోని వాహనాలు నదిని దాటేందుకు విష్ణుపురం బ్రిడ్జ్ ని వాడాలంటే సుమారు 50 నుంచి 80 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో వాహనాలు బల్లకట్టును ఆశ్రయించడం సర్వ సాధారణమే.