: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం


మెదక్ జిల్లాలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి గోదావరిఖని వెళుతున్న టాటా వింగర్ వాహనం జిల్లాలోని కొండపాక శివారులో రాజీవ్ రహదారిపై అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డవారిని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News