: హాస్య నటుడు ఎంఎస్ నారాయణకు తీవ్ర అస్వస్థత... మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలింపు
టాలీవుడ్ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను కొద్దిసేపటి క్రితం హైదరాబాదుకు తరలించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా భీమవరం వెళ్లిన ఎంఎస్ నారాయణ అక్కడే మలేరియా బారిన పడినట్లు సమాచారం. దీనికి చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో మరింత మెరుగైన వైద్యం అవసరమని సూచించిన వైద్యులు హైదరాబాదుకు రెఫర్ చేశారు. ఈ క్రమంలో, ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తున్నారు.