: ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రతా చర్యలు తీసుకుంటోంది. పర్యటన సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తోంది. ఈ నెల 24 నుంచి 26 వరకు రఫి మార్గ్, జనపథ్, మాన్ సింగ్ రోడ్డులను పూర్తిగా మూసివేయనున్నారు. ప్రధానంగా ఈ నెల 26న మౌర్య షెరటాన్ రోడ్డు, సర్దార్ పటేల్ మార్గ్, తీన్ మూర్తి మార్గాలు కూడా మూసివేస్తారు. ఢిల్లీ ట్రాఫిక్ ప్రత్యేక కమిషనర్ ముఖేష్ చందర్ మాట్లాడుతూ, "న్యూఢిల్లీ ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నాం. దీనికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలు 1059కు డయల్ చేయవచ్చు" అని తెలిపారు.

  • Loading...

More Telugu News