: ఆస్ట్రేలియా కెప్టెన్ జార్జి బెయిలీపై ఒక మ్యాచ్ నిషేధం... తదుపరి మ్యాచ్ కి స్మిత్ నాయకత్వం!


నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయించలేకపోయిన ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ జార్జి బెయిలీపై ఊహించినట్టుగానే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడిపై ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఆస్ట్రేలియా ఒక ఓవర్ తక్కువగా వేయడంతో బెయిలీపై ఈ చర్య తీసుకున్నారు. దీంతో హోబర్ట్ లో ఇంగ్లండ్ తో జరిగే తర్వాతి మ్యాచ్ కి జార్జి బెయిలీ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. 12 నెలల వ్యవధిలో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. బెయిలీ గతేడాది నవంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డాడు.

  • Loading...

More Telugu News