: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన సోనాక్షి


ప్రధాని నరేంద్ర మోదీకి బాలీవుడ్ తార సోనాక్షీ సిన్హా కృతజ్ఞతలు తెలిపింది. బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత శత్రుఘ్ను సిన్హా తనయుడు కుశ్ సిన్హా వివాహం ఆదివారం నాడు తరుణ అగర్వాల్ తో ముంబయిలో ఘనంగా జరిగింది. అంతకుముందు, తన సోదరుడి వివాహానికి రావాలంటూ సోనాక్షి తల్లిదండ్రులతో వెళ్లి స్వయంగా ప్రధానిని ఆహ్వానించింది. దీంతో, వివాహ మహోత్సవానికి విచ్చేసిన మోదీ వధూవరులను ఆశీర్వదించారు. తమ ఇంట శుభకార్యానికి ప్రధాని రావడంతో సిన్హా కుటుంబంలో ఆనందం అంబరాన్నంటింది. ఈ నేపథ్యంలోనే సోనాక్షి ట్విట్టర్ వేదికగా ప్రధానికి 'థాంక్స్' చెప్పింది. "పెళ్లికి వస్తానన్న మాట నిలబెట్టుకున్నందుకు థాంక్యూ నరేంద్ర మోదీ సర్. మీ రాకతో పెళ్లి వేడుక మరింత ప్రత్యేకత సంతరించుకుంది" అంటూ అమ్మడు ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News