: అరకును సీఎం చంద్రబాబు దత్తత తీసుకోవడం సంతోషం: అయ్యన్నపాత్రుడు
అరకు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అరకును దత్తత తీసుకున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి అరకు అభివృద్ధితో ముందుకెళుతుందని, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొత్తగా కొనుగోలు చేసిన 2,500 వాహనాలను పోలీస్ శాఖకు అందజేస్తున్నారు.