: రికార్డులున్నది బద్దలవడానికే!: కోరే ఆండర్సన్


వన్డేల్లో తన పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యోధుడు ఏబీ డివిల్లీర్స్ అధిగమించడంపై న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరే ఆండర్సన్ స్పందించాడు. రికార్డులున్నది బద్దలవడానికేనని వ్యాఖ్యానించాడు. జొహాన్నెస్ బర్గ్ లో డివిల్లీర్స్ భీకరమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు అభినందనలు తెలిపాడు. దేన్నీ అసాధ్యంగా భావించరాదని ఈ లెఫ్ట్ హ్యాండర్ అభిప్రాయపడ్డాడు. 36 బంతుల్లో సెంచరీ రికార్డు కోరే ఆండర్సన్ పేరిట ఉండగా, విండీస్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో డివిల్లీర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులతో సరికొత్త వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News