: మానవత్వం పరిమళించిన వేళ... పురిట్లోనే తల్లిని కోల్పోయిన నలుగురికి విరాళాల వెల్లువ


ఆ తల్లి ఒకేసారి నలుగురికి జన్మనిచ్చింది. కన్న బిడ్డలను ఒక్కసారైనా చూడకుండానే కన్నుమూసింది. దీంతో ముగ్గురు పాపలు, ఒక బాబు పొత్తిళ్లలో అనాథలుగా మిగిలారు. వారి ఆలన, పాలన చూసేందుకు ఎవరూ లేరు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు తెలిపింది. బిడ్డల సంరక్షణకు దాతల నుంచి నిధులను కోరుతూ, బిడ్డల తల్లి ఎరికా పేరిట 'ఎరికాస్ మెమోరియల్ ఫండ్' పేరిట ఒక వెబ్ పేజీని క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వందల మంది స్పందించారు. ఈ వెబ్ పేజీని ఒక్కరోజులో సుమారు 17 వేల మంది 'షేర్' చేశారు. మానవత్వం చూపిన 600 మంది 19 వేల డాలర్లు (రూ.11.7 లక్షలు) పంపారు. మరో 30 వేల డాలర్లు సమీకరిస్తామని ఆ సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News