: 'ఘర్ వాపసీ'లకు మీ కుమార్తెలు, చెల్లెళ్ళను ఇచ్చి వివాహం చేస్తారా?: బీజేపీ నేతలకు సమాజ్ వాదీ ప్రశ్న


'ఘర్ వాపసీ' కార్యక్రమంలో భాగంగా మతం మార్చుకున్నవారికి బీజేపీ నేతలు తమ చెల్లెళ్ళు, కూతుర్లను ఇచ్చి వివాహం జరిపించాలని సమాజ్ వాదీ పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. సాధారణ ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన ఎన్నో హామీలను ఆ పార్టీ నేతలు విస్మరించారని ఆయన విమర్శించారు. ముస్లిం యువకులను వివాహం చేసుకున్న హిందూ అమ్మాయిలలో ఒక్కరినైనా వెనక్కు తెచ్చారా? అని ఆయన ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఆ పార్టీ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోందని ఆయన అన్నారు. నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ హామీ సంగతేంటని ఆయన అడిగారు.

  • Loading...

More Telugu News