: రోహిత్ తో గొడవకు దిగిన వార్నర్ మ్యాచ్ పీజులో సగం కోత!
ముక్కోణపు సిరీస్ లో భాగంగా నిన్నటి మ్యాచ్ లో భారత స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మతో అనవసరంగా గొడవకు దిగిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ ముల్యమే చెల్లించుకున్నాడు. ఈ వివాదంపై విచారణ జరిపిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్నర్ దే తప్పని తేల్చింది. విచారణ అనంతరం అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. వార్నర్ విసిరిన ఓవర్ త్రో కు రోహిత్ ఓ పరుగు తీశాడు. దీనిపై విరుచుకుపడ్డ వార్నర్, రోహిత్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా ఆంగ్లంలో మాట్లాడమంటూ రోహిత్ కు సూచించిన అతడు, ఆ తర్వాత రోహిత్ కూడా ఘాటుగానే సమాధానమివ్వడంతో బిత్తరపోయాడు. ఈ క్రమంలో అంపైర్ల రంగప్రవేశంతో ఇరువురూ శాంతించారు.