: అన్ని రకాల సబ్సిడీలపై నియంత్రణ... బాంబు పేల్చిన అరుణ్ జైట్లీ


అన్ని రకాల సబ్సిడీలనూ నియంత్రిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, వృద్ధి బాటలో భారత్ పరుగులు తీయాలంటే సబ్సిడీల కోత తప్పనిసరని జైట్లీ నేడు వ్యాఖ్యానించారు. అయితే దానికి తొందరపడబోమని ఆయన తెలిపారు. 2015-16 బడ్జెట్ లో సబ్సిడీల నియంత్రణపై కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పడిన ఎక్స్ పెండిచర్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన సూచనలను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కాగా, వంట గ్యాస్ సబ్సిడీని ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈనెల ఆరంభం నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News