: "మౌనంగానే ఎదగమనీ..." దత్తన్న నోట చంద్ర బోస్ పాట
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాట పాడి అందరినీ అలరించారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ ను ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఈ రోజు సత్కరించింది. హైదరాబాదు రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రతిభా లలితా కళా పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తన్న 'నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమోరీస్' చిత్రం కోసం చంద్రబోస్ రాసిన 'మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది..." అని రాసిన పాటను వేదికపై పాడారు. ఈ పాట తనకెంతో ఇష్టమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సినారే, సీనియర్ నటి జమున, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు హాజరయ్యారు.