: తుదికంటా కాంగ్రెస్ తోనే... పాలడుగు ప్రత్యేకత!


కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత పాలడుగు వెంకట్రావుకు రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో అడుగిడిన నాటి నుంచి నేడు తుది శ్వాస విడిచేదాకా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తన రాజకీయ ప్రస్థానం మొత్తాన్ని కాంగ్రెస్ తోనే కొనసాగించారు. 1968లో యువజన కాంగ్రెస్ సభ్యుడిగా రాజకీయాల్లో కాలుమోపిన ఆయన 1972-78 మధ్యకాలంలో ఎమ్మెల్సీగా కొనసాగారు. 1978లో నూజివీడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కేబినెట్ లో గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల్లో మెజారిటీ నేతలతో సత్సంబంధాలు కలిగిన పాలడుగు, ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

  • Loading...

More Telugu News