: నాక్కూడా చెప్పకుండానా..? బీజేపీలో చేరిన తరువాత కిరణ్ బేడితో మాట్లాడని అన్నా హజారే!


అవినీతిపై పోరులో ఎంతో సన్నిహితంగా మెలిగిన తనతో కూడా చెప్పకుండా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి బీజేపీలో చేరడాన్ని నవతరం ఉద్యమకారుడు, గాంధేయవాది అన్నా హజారే తట్టుకోలేకపోతున్నారు. బీజేపీలో చేరిన తరువాత హజారే ఆశీర్వాదం పొందాలని కిరణ్ బేడి పలుమార్లు ప్రయత్నించినా, మాట్లాడేందుకు ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది. క్రియాశీల రాజకీయాల్లో చేరడాన్ని ఆయన ఆది నుంచి తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కిరణ్ వద్ద ప్రస్తావిస్తే "అన్నాజీతో మాట్లాడేందుకు ఫోన్లో ట్రై చేశాను. కొన్నిసార్లు ఆయన నిద్రపోతున్నారు. కొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటున్నారు అని సమాధానం వచ్చింది. రేపు మరోసారి ప్రయత్నిస్తా" అన్నారు.

  • Loading...

More Telugu News