: మాలియా, శాషా వస్తారా? మిషెల్ చీర కడుతుందా?: ఒబామా పర్యటనపై పెరుగుతున్న ఆసక్తి
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనపై నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. ఈ నెల 25న భారత్ రానున్న ఆయన భారత గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అంతేకాక ఆగ్రాలోని తాజ్ మహల్ ను కూడా ఆయన సందర్శిస్తారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఒబామా పర్యటనపై నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఆయన భద్రత నిమిత్తం అమెరికా భద్రతా విభాగం అధికారులు భారత్ లో అడుగుపెట్టారు. ఒబామా పర్యటన విశేషాలకు సంబంధించి భారత మీడియాతో పాటు ఢిల్లీలోని విదేశీ మీడియా ప్రతినిధులు కూడా ఆరా తీస్తున్నారు. ఒబామా కూతుళ్లు మాలియా, శాషాలు ఆయన వెంట భారత్ వస్తున్నారా?, భారత పర్యటనలో ఒబామా సతీమణి చీరకట్టులో కనిపిస్తారా? అన్న ప్రశ్నలు కూడా అమెరికా భద్రతా అధికారుల ముందుకు వస్తున్నాయి. అయితే ఒబామా పర్యటనపై ఆ దేశ అధికారులు నోరు మెదపకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.