: రెహమాన్ అని పేరు పెట్టింది ఓ హిందూ జ్యోతిష్యుడు... మతమార్పిడిపై వివరణ ఇచ్చిన సంగీత దిగ్గజం


హిందువుగా పుట్టిన తాను సూఫీ విశ్వాసాల వైపు ఆకర్షితుడు కావడానికి దారితీసిన కారణాలను సంగీత దిగ్గజం ఏ.ఆర్.రెహమాన్ పాకిస్థాన్ పత్రిక 'ది డాన్'కు వివరించాడు. దిలీప్ కుమార్ గా వున్న తన పేరును రెహమాన్ గా మార్చుకోవాలని సూచించింది ఒక హిందూ జ్యోతిష్యుడని ఆయన స్పష్టం చేశారు. రెహమాన్ ముందు 'అల్లారఖా' అని చేర్చుకోమని సూచించాడని పేర్కొన్నాడు. తండ్రి చనిపోయి, చేతిలో డబ్బులేక కష్టాలు అనుభవిస్తున్న సమయంలో సూఫీ మత గురువు పీర్ కరిముల్లా షా ఖాద్రి బోధనలతో ఉపశమనం పొందానని ఆయన తెలిపారు. ఎంతో బాధలో తానున్నప్పుడు ఎవరూ ఓదార్చలేదని ఆయన అన్నారు. ఇప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా వున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News