: పాలడుగు మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు, రోశయ్య
కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పాలడుగు చేసిన సేవలు చాలా గొప్పవని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీఎస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీఎస్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కంతేటి సత్యనారాయణరాజు, పార్థసారథి, కామినేని శ్రీనివాస్ లు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. నిజాయతీ గలిగిన రాజకీయవేత్తను కోల్పోయామని శోభనాద్రీశ్వరరావు అన్నారు.