: ఒబామా భద్రత కోసం 1600 మంది అమెరికా సిబ్బంది


అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అధ్యక్షుడి రక్షణ కోసం ఏకంగా 1600 మంది సిబ్బంది అమెరికా నుంచి తరలి వస్తున్నారు. వీరిలో ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన వారే కాకుండా, సీఐఏకు చెందిన వారు కూడా ఉన్నారు. 2010లో భారత్ కు ఒబామా విచ్చేసినప్పుడు 800 మంది భద్రతా సిబ్బంది వస్తే... ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయింది. అంతే కాకుండా, ఒబామా ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లేటప్పుడు, రోడ్డు పక్కల ఎక్కడా హోటళ్లు, షాపులు తెరవరాదని ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు మీద వీధి కుక్కలు కూడా కనిపించరాదని భద్రతా సిబ్బంది మన అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News