: చదువుకున్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడంలేదు.. పిల్లలను కనడంలేదు: చంద్రబాబు


దేశంలో జనాభా తగ్గుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వెలిబుచ్చారు. చదువుకున్న వాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకోవడంలేదని, పిల్లలను కనడంలేదని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వేలివెన్ను ప్రాంతంలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఏటా 9 లక్షల మంది చనిపోతున్నారని, 9 లక్షల మంది పుడుతున్నారని వివరించారు. మరికొన్ని రోజులు పోతే చనిపోయే వారి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. అప్పుడు వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతుందని వివరించారు. జపాన్ లో వృద్ధులే ఎక్కువగా ఉన్నారని, అక్కడ చిన్నారుల సంఖ్య తక్కువని ఈ సందర్భంగా బాబు పేర్కొన్నారు. వీలైతే ఒకరిద్దరిని ఎక్కువగా కన్నా నష్టంలేదని ఆయన ప్రజలకు సూచించారు. అప్పట్లో తాను ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాలని ప్రజలకు చెప్పానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి యువకుల అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News