: ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్... సెంచరీ చేజార్చుకున్న ఫించ్
ముక్కోణపు సిరీస్ లో టీమిండియాతో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్లకు 241 పరుగులు చేసింది. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 27 పరుగులు చేయాలి. చేతిలో 5 వికెట్లున్నాయి. 96 పరుగులు చేసిన ఓపెనర్ ఫించ్ శతకం చేజార్చుకున్నాడు. ఫించ్ ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (15 బ్యాటింగ్), వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ (1 బ్యాటింగ్ ) ఉన్నారు.