: కృష్ణానదిలో చిక్కుకున్న తహశీల్దార్, ఎస్సై


కర్నూలు జిల్లా ముచ్చుమర్రి వద్ద కృష్ణానదిలో పగిడ్యాల తహశీల్దార్ రమేశ్ బాబు, నందికొట్కూరు ఎస్సై జహీర్ బాషా చిక్కుకున్నారు. దాంతో, వారిని రక్షించేందుకు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ జిల్లాలోని సింగాటం వద్ద జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరబోట్ల పర్యవేక్షణ కోసం తహశీల్దార్, ఎస్సై నదిలోకి వెళ్లారు. ఆ క్రమంలోనే వారు నదిలో చిక్కుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News