: ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి: ఎర్రబెల్లి డిమాండ్
కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. నేడు ఆయన హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కాగా, హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల్పరించారు.