: రో'హిట్'... సెంచరీతో పాటు మరో రెండు రికార్డులు


ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ సత్తా చాటాడు. 139 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 138 పరుగులు చేసాడు. ఒక్క సెంచరీ మాత్రమే కాదు మరో రెండు రికార్డులను రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. మెల్బోర్న్ స్టేడియంలో ఒక మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడిగా, అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2000 జనవరి లో జరిగిన వన్ డేలో గంగూలీ ఇదే గ్రౌండ్లో 100 పరుగులు చేశాడు. ఇప్పుడు రోహిత్ ఆ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంతకుముందు ఇక్కడ భారత బ్యాట్స్మెన్ శ్రీకాంత్, అగార్కర్ లు చెరో 2 సిక్సర్లు బాదారు. తాజాగా రోహిత్ 4 సిక్స్ లు కొట్టాడు.

  • Loading...

More Telugu News