: కాస్త మానవత్వం... రెండొందల మంది బందీలను విడుదల చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తొలిసారిగా కాస్తంత మానవత్వం చూపారు. గతంలో తాము అపహరించిన ఇజ్ది తెగకు చెందిన 200 మందిని ఐఎస్ఐఎస్ విడుదల చేసినట్టు తెలుస్తోంది. బాగ్దాద్కు 250 కిలోమీటర్ల దూరంలోని కిర్కిక్ పట్టణంలో వీరిని విడిచిపెట్టినట్టు సమాచారం. పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. విడుదలైన బందీలలో అత్యధికులు వృద్ధులే. గత ఏడాది ఆగస్టులో ఉగ్రవాదులు ఇజ్ది తెగవారు అధికంగా వుండే ప్రాంతాల్లో దాడి చేసి వందలమందిని చంపి, మరింత మందిని అపహరించుకొని పోయిన సంగతి తెలిసిందే.