: మెక్ డొనాల్డ్స్ సిగ్గుమాలిన చర్య... విచారణకు ఆదేశం


ఫాంటా కొనుక్కునేందుకు వచ్చి క్యూలో నిలబడ్డ ఓ వీధి బాలుడిని పుణే మెక్ డొనాల్డ్స్ ఉద్యోగులు బయటకు నెట్టివేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెక్ డొనాల్డ్స్ చర్యపై ఇంటర్నెట్ మాధ్యమంగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే... ఆహార పదార్థాలు కొనుగోలు చేసేందుకు ఓ యువతి తన స్నేహితురాళ్ళతో కలిసి మెక్ డొనాల్డ్స్ కు వెళ్లింది. బయట ఒక ఫాంటా కావాలని అడుక్కుంటున్న బాలుడికి దాన్ని కొనివ్వాలని భావించింది. ఆ వీధి బాలుడిని తీసుకుని లోపలకు వెళ్లి క్యూలో నిలుచోగా, మెక్ డొనాల్డ్స్ స్టాఫ్ వచ్చి ఆ బాలుడిని బయటకు లాగేశారు. వాడు తనతో వచ్చాడని ఆ యువతి చెప్పినప్పటికీ వినలేదు. మొత్తం ఘటనను ఆమె ఫ్రెండ్స్ వీడియో తీయగా ఫేస్ బుక్ లో పెట్టింది. అంతే... ఈ ఘటనపై మెక్ డొనాల్డ్స్ కు వ్యతిరేకంగా గళం కదిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో వైపు మెక్ డొనాల్డ్స్ యాజమాన్యం సైతం పుణే అవుట్ లేట్ నిర్వాహకులపై అంతర్గత విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News