: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వైకాపా ఎంఎల్ఏ కూతురు
గతరాత్రి బంజారాహిల్స్ లో పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ లో సుమారు 30 మంది మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో కృష్ణా జిల్లా పామర్రు వైకాపా ఎంఎల్ఏ ఉప్పులేటి కల్పన కుమార్తె కీర్తి కూడా వున్నారు. ఈమె పోలీసులను చూసి తన కారును వెనక్కు తిప్పి పారిపోబోగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె అతిగా మద్యం సేవించి వున్నారని, శరీరంలో 105 ఎంజీ బ్లడ్ ఆల్కహాల్ వుందని తెలుస్తోంది. ఆమె నడుపుతున్న వాహనం ఏపీ 09 సీయూ 9029ను సీజ్ చేసి కేసు బుక్ చేసినట్టు పోలీసులు వివరించారు.