: తెలంగాణలో ఆంధ్ర పార్టీలు అవసరమా?: ఈటెల


ఆంధ్ర నేతలు, ఆంధ్ర పార్టీలు అంటూ ఎప్పుడూ విమర్శించే టీఎస్ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంది ఆంధ్ర పార్టీలే అని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో ఆంధ్ర పార్టీలు అవసరమా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగాలు, నీరు తదితర అంశాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏడు నెలల్లోనే అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News