: పెషావర్ ఊచకోతలో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్


పాకిస్థాన్ లోని పెషావర్ లో ఉన్న సైనిక స్కూల్ పై పాక్ తాలిబన్లు చేసిన దాడిలో 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్గత ఉగ్రవాదంపై పాక్ ప్రభుత్వం దాడులు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు పెషావర్ ఘటనతో సంబంధమున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిని ఆఫ్ఘనిస్థాన్ లో అరెస్ట్ చేశారు. పెషావర్ ఘటన తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దులో గల ఉగ్రవాద స్థావరాలపై పాక్ బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి.

  • Loading...

More Telugu News