: లిటరరీ ఫెస్టివల్ ను అంతర్జాతీయ ఈవెంట్ గా నిర్వహించాలి: కేటీఆర్


హైదరాబాదులో ఈ నెల 23 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు 'హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్' జరగనుంది. ఈ నేపథ్యంలో, ఈరోజు టీఎస్ మంత్రి కేటీఆర్ తో ఫెస్టివల్ నిర్వాహకులు భేటీ అయ్యారు. ఫెస్టివల్ కు 12 దేశాల నుంచి 14 భాషలకు చెందిన 135 మంది రచయితలు హాజరవుతున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ కు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం గొప్పదనాన్ని తెలిపేలా ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నామని చెప్పారు. ఫెస్టివల్ కు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. లిటరరీ ఫెస్టివల్ ను ఇంటర్నేషనల్ ఈవెంట్ గా నిర్వహించాలని సూచించారు.

  • Loading...

More Telugu News