: జంటనగరాలను జల్లెడ పడుతున్న పోలీసులు
ఇస్లామిక్ స్టేట్ లో చేరేందుకు హైదరాబాదు యువకుడు ప్రయత్నించి దొరికిపోవడం, ఆయనకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైటులో వందల సంఖ్యలో మిత్రులు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కులను తనిఖీ చేశారు. ప్రతి రద్దీ ప్రదేశాన్నీ నిశితంగా పరిశీలించారు. తనిఖీలో భాగంగా అనుమానితులుగా కనిపించిన 80 మంది నుంచి వేలిముద్రలు స్వీకరించి వారి పూర్తి వివరాలు సేకరించారు.