: తెలంగాణకు మాత్రమే! రెండు రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర


తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 మేర పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌ పై లీటరుకు రూ.2 వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న పెట్రోల్, డీజిల్‌ పై ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం ప్రకటించగా, అంతకు గంట ముందు లీటరుపై రూ.2 సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎంతగా తగ్గినా, ఆ మేరకు లాభం మాత్రం ప్రజలకు అందడం లేదు.

  • Loading...

More Telugu News