: చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం... దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు ఎస్పీ
ప్రాణాలు పోయాయని వదిలివెళ్లారో... లేక వదిలించుకున్నారో... కర్నూలు ఆసుపత్రి వద్ద చెత్తకుప్పలో ఓ చిన్నారి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. ఆ పాపకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో నేటి ఉదయం ఎస్పీ రవికృష్ణ స్వయంగా ఆ చిన్నారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించిన రవికృష్ణ అందరిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లలను అనాధలుగా వదిలివేయవద్దని కోరారు. అనాధ పిల్లల గురించి 1098 నంబర్ కు సమాచారం ఇస్తే, వారిని ఐసీడీఎస్ కు అప్పగించి సంరక్షిస్తామని తెలిపారు.