: అడవుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం: కేసీఆర్
అడవులను రక్షించే విషయంలో గత ప్రభుత్వాలు చాలా ఉదాసీనంగా వ్యవహరించాయని టీఎస్ సీఎం కేసీఆర్ అన్నారు. చాలా చోట్ల అడవులు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. అడవుల రక్షణ విషయంలో ఇకపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రస్తుత చట్టాలను సమీక్షించి కొత్త చట్టాలను తెస్తామని... అడవుల నరికివేతకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లోగోను, డైరీని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖ లోని ఖాళీలను భర్తీ చేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.