: ఎన్డీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైకాపా
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైకాపా ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్ రెడ్డి, ఎ.రామకృష్ణారెడ్డిలు మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రజలకు మాత్రం ఏ మాత్రం మేలు జరగలేదని అన్నారు. సుంకాలను పెంచుతూ ప్రజలపై భారం మోపే ప్రయత్నాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే.. లీటర్ పెట్రోలు రూ. 45, 50 కే లభించాలని... అయితే, అలా జరగడం లేదని విమర్శించారు. ఇంధన ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని అన్నారు.