: మందు మానేస్తానంటున్న టెన్నిస్ సుందరి మరియా షరపోవా
త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న వరల్డ్ నెంబర్-2 మరియా షరపోవా తనకెంతో ఇష్టమైన వైన్ ను తాగరాదని నిర్ణయించుకుంది. తనను తాను నిరూపించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ అందాల టెన్నిస్ సుందరి తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిస్తే షరపోవా తిరిగి వరల్డ్ నెంబర్-1గా నిలవనుంది. కాగా, షరపోవా 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. మొత్తం 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు గెలుచుకున్న షరపోవా, మరోసారి మెల్బోర్న్ పార్క్ లో సత్తా చాటాలని భావిస్తోంది.