: సెన్సార్‌ బోర్డు ఖాళీ... తొమ్మిది మంది సభ్యుల రాజీనామా!


కేంద్ర ప్రభుత్వానికి, సెన్సార్ బోర్డుకూ మధ్య దూరం మరింత పెరిగింది. నిన్న సెన్సార్ బోర్డు ఛైర్మన్ లీలా శ్యాంసన్ తన పదవికి రాజీనామా చేయగా, ఇవాళ మరో 9 మంది సెన్సార్ బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా పత్రాలను కేంద్ర సమాచారశాఖ మంత్రికి పంపినట్టు తెలిసింది. కాగా, 'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రానికి వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్, హరియానా రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. ఆ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ శిరోమణి అకాళీదళ్, ఇండియన్ నేషనల్ లోక్‌ దళ్, సిక్కు గురుద్వారా మేనేజ్‌ మెంట్ కమిటీ తదితర సంస్థలు నిరసనలు చేపట్టాయి. కాగా, ఆందోళన చేస్తున్న వారంతా ఒక్కసారి తన సినిమా చూడాలని, అందులో ఏమైనా అభ్యంతరకర దృశ్యాలుంటే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని డేరా సచ్చా సౌద చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కోరారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, వ్యభిచారిణులకు పునరావాసం కల్పించాలన్న కథాంశంతో సినిమా తీశానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News