: ప్రపంచకప్ తుదిపోరులో ఒక జట్టు భారత్... రెండో జట్టు కోసమే పోటీ: ధోనీ ధీమా
వన్డే ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత జట్టు కచ్చితంగా ఉంటుందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. రెండో జట్టు కోసమే మిగతా దేశాలన్నీ పోటీపడుతున్నాయని ఆయన చెప్పాడు. 2011 నాటి ప్రదర్శనను ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో పునరావృతం చేయగలమనే ధీమాతో ఉన్నామని, పరిస్థితులకు తగ్గట్లుగా ఆటతీరును మార్చుకున్నామని ఆయన తెలిపాడు. మార్చి 29న మెల్బోర్న్ మైదానంలో ఫైనల్ ఆడేందుకే భారత జట్టు ఆస్ట్రేలియా వచ్చిందని ధోని పేర్కొన్నాడు. టెస్టుల నుంచి తప్పుకోవడం వల్ల తనకు అదనంగా విశ్రాంతి దొరికిందని, దీనివల్ల తాజాగా బరిలోకి దిగుతున్నానని తెలిపాడు.