: ఆంధ్ర నాయకుల నుంచి ఇంకా ముప్పు పొంచి ఉంది: శ్రీనివాస్ గౌడ్


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ... ఆంధ్ర నాయకుల నుంచి ఇంకా ముప్పు పొంచి ఉందని టీఎస్ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఆంధ్ర నేతలు ఇంకా కుట్రలు పన్నుతూనే ఉన్నారని... తెలంగాణ వారంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులంతా ఎలా పాల్గొన్నారో... అదే విధంగా రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన డైరీ, క్యాలెండర్ ను ఆయన నల్లగొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News