: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన చమురు సంస్థలు


పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై రూ. 2.42, లీటర్ డీజిల్ పై రూ. 2.25 తగ్గించాయి. అయితే, చమురు సంస్థలు ధరలను తగ్గించక ముందే, పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ సుంకాన్ని 2 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, మొత్తం మీద వినియోగదారులకు లీటర్ పెట్రోల్ పై 42 పైసలు, లీటర్ డీజిల్ పై 25 పైసల ధర తగ్గినట్టైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News