: పెట్రోల్, డీజిల్ పై మరోసారి సుంకాన్ని పెంచిన కేంద్రం
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడయిల్ ధర కుప్పకూలుతుంటే... మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాన్ని ఆదాయం పెంచుకునేందుకు వినియోగించుకుంటోంది. ఈ రోజు తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని పెంచింది. లీటర్ కు రూ. 2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 1న కూడా పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని పెంచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం సుంకాన్ని పెంచినట్టు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.