: అమిత్ షాతో భేటీ అయిన ఆప్ మాజీ నేత షాజియా ఇల్మీ


ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత షాజియా ఇల్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఆమె బీజేపీలో చేరే విషయమై వీరిద్దరి మధ్యా చర్చ జరిగినట్టు సమాచారం. అమిత్ తో సమావేశం అనంతరం షాజియా మాట్లాడుతూ, "అమిత్ షాతో సమావేశం ఆహ్లాదకరంగా సాగింది. ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. వీలైనంత త్వరలోనే నేను బీజేపీలో చేరుతా" అని తెలిపారు. అయితే, బీజేపీలో షాజియా చేరినట్టు కాసేపట్లో ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున పోటీ చేస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

  • Loading...

More Telugu News