: ఒకట్రెండు రోజుల్లో టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నోటిఫికేషన్ తో విభేదించిన తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని టీఎస్ విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ విద్యా పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.