: వచ్చే వారం దావోస్ పర్యటనకు చంద్రబాబు... ఆ తర్వాత చైనా పర్యటన!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 21న దావోస్ పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు ఇప్పటికే జపాన్, సింగపూర్ లలో పర్యటించిన ఆయన తాజాగా దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, నేటి సాయంత్రం ఎకనమిక్ టైమ్స్ నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నెల 21న దావోస్ బయలుదేరనున్న చంద్రబాబు 24 దాకా అక్కడ పర్యటిస్తారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన దావోస్ పర్యటన ఖరారైంది. దావోస్ పర్యటన అనంతరం చైనాలోనూ పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే దావోస్ పర్యటన ముగిసిన తర్వాత కాని చైనా పర్యటన ఖరారయ్యే అవకాశాలు లేవు.

  • Loading...

More Telugu News